- హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తమ కస్టమర్లు మరియు సంభావ్య వినియోగదారులకు సౌకర్యవంతమైన రీతిలో అమ్మకాలు,సేవ, మార్పిడి పరిష్కారాలను అందించడానికి ‘హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్’ ప్రచారాన్ని ప్రారంభించింది
- మార్చి23, 2025 ఆదివారం నాడు భారతదేశ వ్యాప్తంగా రోజంతా జరిగే ఈ కార్యక్రమం, వినియోగదారులకు వారికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో అదనపు ఛార్జీ లేకుండా ప్రత్యేకమైన ఆఫర్లు మరియు సేవలను అందిస్తుంది.
- ‘హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్’ప్రచారం అనేది హ్యుందాయ్ కస్టమర్లకు దాని ‘ఐసి కేర్ నోవేర్’ సేవా కార్యక్రమంకు అనుగుణంగా సేవలను అందించే HMIL యొక్క ఔట్రీచ్ కార్యక్రమంలో భాగం.
నవతెలంగాణ ఢిల్లీ: భారతదేశంలోని ప్రముఖ ప్రీమియం, స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రదాత అయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఈరోజు 2025 ఎడిషన్ ‘హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్’ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారం ప్రస్తుత కస్టమర్లు తమ హ్యుందాయ్ వాహనాల సేవ కోసం ఉచిత చెక్-అప్ మరియు డిస్కౌంట్ కూపన్‌లను పొందే సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ కస్టమర్ కేంద్రీకృత కార్యక్రమం మొత్తం యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచనుంది , మొదటిసారి కొనుగోలు చేసేవారు లేదా తమ ప్రస్తుత వాహనాలను మార్పిడి చేసుకోవడంతో పాటుగా అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారిని కనెక్ట్ కావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక రోజు పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కస్టమర్ ఔట్రీచ్ కార్యక్రమం మార్చి 23, 2025, ఆదివారం నాడు జరగనుంది.
ఈ ప్రత్యేకమైన కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమం పై HMIL హోల్-టైమ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ , “హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ వద్ద , ప్రతి మైలు, ప్రతి మలుపులో మా కస్టమర్లకు అండగా ఉండటానికి మేము కట్టుబడి ఉన్నాము. ‘హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్’ ప్రచారం అత్యాధునిక స్మార్ట్ మొబిలిటీ పరిష్కారాలు , సమగ్ర యాజమాన్య అనుభవాన్ని అందిస్తూనే, విశ్వసనీయత , కస్టమర్-ఫస్ట్ విధానం పట్ల మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. మార్చి 23, 2025 ఆదివారం జరగనున్న ఈ శిబిరం యొక్క 2025 ఎడిషన్, మా కస్టమర్లకు ప్రత్యేకమైన అనుభవాలను సృష్టించడానికి మా నిరంతర ప్రయత్నాన్ని పునరుద్ఘాటిస్తుంది. సంవత్సరాలుగా, ‘హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్’ ప్రచారం ఆటోమోటివ్ పరిశ్రమలో ఎక్కువ మంది కోరుకునే కార్యక్రమంగా ఉద్భవించింది, మా కస్టమర్లు , సంభావ్య వినియోగదారులకు హ్యుందాయ్ యొక్క సాటిలేని అమ్మకాలు, సర్వీస్ మరియు ప్రీ-ఓన్డ్ కార్ సేల్స్ ఆఫర్‌లను ఒకే చోట, వారున్న ప్రాంతాలకు దగ్గరగా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది” అని అన్నారు. నైపుణ్యం కలిగిన హ్యుందాయ్ టెక్నీషియన్లు 18-పాయింట్ల ఉచిత తనిఖీ తర్వాత వారి హ్యుందాయ్ వాహనాల కోసం అనుకూలీకరించిన రాబోయే సేవా అవసరాలపై కస్టమర్లకు సలహా ఇస్తారు. కస్టమర్లు గెలుచుకునే అవకాశం ఉన్న వివిధ అనుసంధానిత కార్యకలాపాలు కూడా నిర్వహించబడ్డాయి:
- ఉపకరణాలపై 20% తగ్గింపు
- వీల్ అలైన్‌మెంట్ మరియు బ్యాలెన్సింగ్‌పై50% తగ్గింపు
- ఇంటీరియర్ క్లీనింగ్ మరియు బాహ్య సుసంపన్నతపై 30% తగ్గింపు
- మెకానికల్ లేబర్‌పై20% తగ్గింపు
- యాంటీ-రస్ట్ కోటింగ్‌పై 10% తగ్గింపు
- ఉచిత డ్రై వాష్ సర్వీస్
కస్టమర్లు, సంభావ్య వినియోగదారులు తమ ప్రస్తుత కారును కూడా మూల్యాంకనం చేయవచ్చు, తమకు ఇష్టమైన హ్యుందాయ్ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు. కొత్త హ్యుందాయ్ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ సూపర్ డిలైట్ మార్చి ఆఫర్‌ల కింద, కొత్త హ్యుందాయ్ వాహనం కొనుగోలుపై వినియోగదారులు రూ. 55,000 వరకు (నగదు & మార్పిడి ప్రయోజనాలతో సహా) ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే, మార్చి 2025 చివరి వరకు వినియోగదారులకు రూ. 5,000 అదనపు స్క్రాపేజ్ బోనస్ అందించబడుతోంది. హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్ ప్రచారం గురించి మరిన్ని వివరాల కోసం, వారి సమీప హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.