బుమ్రాకు ఐసీసీ అవార్డులు

ICC awards for Bumrah– ప్రదానం చేసిన ఐసీసీ అధ్యక్షుడు జై షా
దుబాయ్ : భారత స్టార్‌ పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా ఐసీసీ పురస్కారాలు అందుకున్నాడు. దుబాయ్ లో ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు జరిగిన కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు జై షా అవార్డులను బుమ్రాకు అందజేశాడు. ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌తో పాటు ఐసీసీ మెన్స్‌ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాలను బుమ్రా దక్కించుకున్నాడు. ఐసీసీ టెస్టు, టీ20 జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారంతో పాటు సర్‌ గార్‌ఫిల్డ్‌ సోబర్స్‌ అవార్డును బుమ్రా సొంతం చేసుకున్నాడు. ఐసీసీ టెస్టు, టీ20 జట్లలో నిలిచినందుకు ప్రత్యేకంగా రూపొందించిన క్యాప్‌లను ప్రదానం చేశారు. సతీమణి సంజన గణేశన్‌తో కలిసి అవార్డు వేడుకకు హాజరైన బుమ్రా.. అంతకుముందు ప్రాక్టీస్‌ చేస్తున్న భారత క్రికెటర్లతో కలిసి ముచ్చటించాడు. కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించాడు.

Spread the love