ముంబయి: ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ 2024-25 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 14.6 శాతం వృద్ధితో రూ.11,059 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9,648 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 7.3 శాతం పెరిగి రూ.19,553 కోట్లకు చేరింది. కాగా మొండి బాకీల కోసం కేటాయింపులు రూ1,332 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,292 కోట్లు కేటాయించింది. 2024 జూన్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.15 శాతంగా, నికర నిరర్థక ఆస్తులు 0.43 శాతంగా నమోదయ్యాయి.