కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రజా తెలంగాణ వస్తుంది

 –  కల్యాణలక్ష్మి కింద అదనంగా తులం బంగారం
 – ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయి
 – ఎన్నికల ప్రచారంలో జయవీర్ రెడ్డి
నవతెలంగాణ -పెద్దవూర : కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణ లో దొరల తెలంగాణ పోయి ప్రజా తెలంగాణ వస్తుందని గెలువు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేలని సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవిర్ రెడ్డి అన్నారు. శనివారం మండలం లో పాల్తీ తండా,పర్వేదుల జయరాంతండా, కోమటికుంట తండా, బాసోనిబావి తండా, ఉట్లపల్లి గేమ్యానాయక్ తండా, పులిచర్ల, పోతునూరు, ఏనీమీదగూడెం, సంగారం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు జానారెడ్డికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. తొమ్మిదేళ్లు బీఆర్‌ఎ్‌సకి అధికారం ఇచ్చి చూశారు కదా.. ఇపుడు కాంగ్రె్‌సను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే ఇచ్చిన మాటను అమలు చేసి తీరుతారన్నారు. మహిళలకు ప్రతీ నెల రూ.2500, రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూనే ఒక తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పారు. ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు రూ.500 బోనస్‌ ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 2లక్షలు ఒకేసారి ఋణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఆసరా పెన్షన్‌ కింద రూ.4 వేల నెలవారీ పింఛన్‌, రూ.10 లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా కల్పిస్తామని చెప్పారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి మాజీ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, మాజీ ఎంపీపి రమావత్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ దండ మనోహర్ రెడ్డి, శిశుపాల్ రెడ్డి జిల్లా నాయకులు గడ్డం పల్లి వినయ్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, బిచ్చు నాయక్, హార్జా, ఇంద్రగంటి వెంకటరెడ్డి బీరెడ్డి బాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love