ర్యాగింగ్‌ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు : జడ్జీ సుచరిత

ర్యాగింగ్‌ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు : జడ్జీ సుచరితనవతెలంగాణ-జనగామ
ర్యాగింగ్‌ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ సుచరిత హెచ్చరించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జనగాం ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏబీవీ జూనియర్‌ కళా శాలలో విద్యార్థినీ విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సద స్సులో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ సుచరిత ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యా ర్థులకు ద ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రొం సెక్సువల్‌ అఫేన్సెస్‌ యాక్ట్‌ 2012 పై వి ద్యార్థినులకు వారి రక్షణపై అనేక రకాల ఉదాహరణలతో వారికి వివరంగా తెలి యజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ర్యాగింగ్‌ చేయ టము చట్టరీత్యా నేరమన్నారు. దానివలన పిల్లల భవిష్యత్తు పాడవుతుంది తెలిపారు. ఎవరైనా ర్యా గింగ్‌ చేస్తున్నట్లు అయితే వెంటనే ప్రిన్సిపాల్‌ కి లేదా కాలేజీ లెక్చరర్లకు తెలియ జేయాన్నారు. బాలికలు ఇంటికి వెళ్లేటప్పుడు ఎవరు అనుసరిస్తున్నారో,అసభ్యంగా ఎవరు ప్రవర్తిస్తున్నారో చుట్టూ పక్కల వారిని గ్రహించాలని సూచించారు. ఒంటరిగా దూర ప్రయాణాలు చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు నేర ప్రవత్తి లోకి దిగవద్దన్నారు. చదువుపై శ్రద్ధ చూపమన్నారు. తల్లిదండ్రులు, పెద్దవాళ్లు, టీచర్లు అనుభవంతో చెప్తారు అది మన మంచికే అని, ఆలోచించండి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ కనకరాజు, చీఫ్‌ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఏం.రవీంద్ర, అసిస్టెంట్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ జోష్నా, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love