హరీష్ రావు చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్..
నవతెలంగాణ – అచ్చంపేట 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం అచ్చంపేట నియోజకవర్గం లో డారెడ్డిపల్లి గ్రామంలో బిజెపికి అధిక ఓట్లు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అసత్యపు ఆరోపణలలో నిజమని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సవాల్ విసిరారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు సవాలను స్వీకరించి నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాలనుటి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా నాయకుడు అని ప్రజాస్వామ్య పద్ధంగా జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 983 ఓట్లు మెజార్టీ వచ్చినట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించినట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అధికారం కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ నాయకులు మతిస్థిమితం తప్పి అవగాహన లేకుండా అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. విలేకరుల సమావేశంలో జడ్పిటిసి మంత్రియా నాయక్, ప్రతాప్ రెడ్డి, అనంతరెడ్డి , రామనాథం, తదితరులు ఉన్నారు.

Spread the love