తిరస్కరిస్తే ఐసీయూలో చేర్చుకోరు

– రోగులు కానీ.. వారి కుటుంబీకులు కానీ నిరాకరిస్తే అంతే
– కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: తీవ్ర అస్వస్థతకు గురైన రోగులను వారు (రోగులు), వారి కుటుంబీకులు, బంధువులు నిరాకరిస్తే ఆస్పత్రులు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ)లో చేర్చుకోలేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఐసీయూ అడ్మిషన్‌లపై ఇటీవలి మార్గదర్శకాలలో పేర్కొన్నది. ఈ మార్గదర్శకాలను 24 మంది నిపుణులు సంకలనం చేశారు. తదుపరి చికిత్స సాధ్యం కానప్పుడు, అందుబాటులో లేనప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులలో లేదా చికిత్స కొనసాగింపు ఫలితంపై, ముఖ్యంగా మనుగడపై ప్రభావం చూపకపోతే, ఐసీయూలో ఉంచటం వ్యర్థమైన సంరక్షణ అని నిపుణులు సిఫారసు చేశారు. అంతేకాకుండా, విపత్తు పరిస్థితిలో వనరుల పరిమితి ఉంటే.. రోగిని ఐసీయూలో ఉంచటానికి తక్కువ ప్రాధాన్యత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రోగిని ఐసీయూలో చేర్చే ప్రమాణాలు అవయవ వైఫల్యం, అవయవ మద్దతు అవసరం, వైద్య పరిస్థితిలో క్షీణతను అంచనా వేయటంపై ఆధారపడి ఉండాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. వీటితో పాటు మరికొన్ని మార్పులను ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చాయి.

Spread the love