మనం గర్జిస్తే.. ఢిల్లీ పీఠం కదలాలి

If we roar.. the peetha of Delhi should move– పార్లమెంట్లో చర్చ జరగాలి
– వెనకడుగు వేస్తే ముప్పు తప్పదు
– వర్గీకరణ.. ఐక్యతను దెబ్బతీసే కుట్ర
– ఈ పోరాటం, జోష్‌ ఇక ఆగొద్దు
– ఇక దేశవ్యాప్త ఉద్యమం తప్పదు : మాలల ‘సింహ గర్జన’లో ఎక్తా అంబేద్కర్‌ జాతీయ నేత చిరాగ్‌ పాశ్వాన్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మనం గర్జిస్తే ఢిల్లీ పీఠం కదలాలనీ, ప్రధాని సీటుకు వణుకు పుట్టాలని ఏక్తా అంబేడ్కర్‌ జాతీయ నేత బాదానాధ్‌ పాశ్వాన్‌ అన్నారు. మాలల సంఖ్య ఎంత ఉందో ముందు తేల్చందని అన్నారు. అవేవీ చూడకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తారని ప్రశ్నించారు. ఈ సభ మాల సామాజిక వర్గంలో జోష్‌ నింపుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘మాలల సింహ గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయంపై మాల అడ్డుకుంటారనే విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోయిందన్నారు. ఇదే స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తే. ఈ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంట్‌లో మాలల గురించి చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. ఆ దిశగా పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. బహుజన దళితుల కోసం పోరాటం చేస్తున్నామని, తెలంగాణ, ఏపీలో కాదు. ఢిల్లీలో చర్చ జరగాలన్నారు. దిశగా కార్యాచరణ అమలు చేయాలని మాల సామాజికవర్గం నేతలకు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ వరకు మాలల పోరాటం చేరితే మోడీ కుర్చీ కదలాలని నినదించారు. మాలలు ఏకం కావడంతో మైదానం సరిపోలేదన్నారు. దేశంలోనే ఇంత మంది మాలలు ఒకే చోట చేరడం ఇక మొదటిసారి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మైదానానికి తరలి వచ్చినట్టే ఢిల్లీకి రావాలని కోరారు. తాము అండగా ఉంటామని తెలిపారు. మాలల హక్కులను కాలరాసేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగానే అలాంటి మాలల పోరాటం అని స్పష్టం చేశారు. మాలల కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. దేశవ్యాప్త ఉద్యమం తప్పదనీ, అందుకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఐక్యతను దెబ్బ తీసే కుట్ర: ఎంపీ మల్లు రవి
ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్‌ 341కి వ్యతిరేకంగా ఉందని ఎంపీ మల్లు రవి అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మాలల పోరాటమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. షెడ్యూల్‌ కులాలను ఆదుకునేందుకు అంబేద్కర్‌ రిజర్వేషన్లు తెచ్చారని గుర్తు చేశారు. రిజర్వేషన్‌ ఫలాల వల్లనే సమాజంలో ఎస్సీలు కొంత ముందుకువచ్చారని తెలిపారు. సమాజంలో కుల వ్యవస్థ మనల్నీ ఇంకా వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ ఇచ్చిన హక్కులను కూడా తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాలడ్‌ చేశారు.
వెనక్కి తగ్గేదేలేదు: ఎమ్మెల్యే వివేక్‌
మాలల సింహా గర్జన మీటింగు ఎంతో మంది అవహేళన చేశారని వివేక్‌ చెప్పారు. కానీ సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాలు నుంచి పెద్దఎత్తున తరలివచ్చి సభను సక్సెస్‌ చేశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలని కోరారు. కుల వివక్ష చూసే అంబేడ్కర్‌ రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు కల్పించారని.తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు నాగరాజు, వినోద్‌, నాయకులు జి చెన్నయ్య, మందాల భాస్కర్‌, గాయకులు రెంజర్ల రాజేష్‌, గోరటి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు కళా బృందాల ప్రదర్శలను ఆకట్టుకున్నాయి.

Spread the love