Tuesday, August 18, 2026
E-PAPER
Homeమానవిఈ చిట్కాలు పాటిస్తే..

ఈ చిట్కాలు పాటిస్తే..

- Advertisement -

వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇళ్లలో వివిధ రకాల పురుగులు, కీటకాలు ఎక్కువగా కనిపించడం సహజం. ఈ పురుగులను ఆహారంగా తీసుకునే బల్లులు కూడా తమ దాక్కున్న ప్రదేశాల నుంచి బయటకు వస్తాయి. ముఖ్యంగా ఇంటి గోడలు, పైకప్పు, కిటికీలు, వంటగది మూలలు వంటి ప్రాంతాల్లో బల్లులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. రాత్రి సమయంలో వాటి సంచారం మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంట్లో అవి తిరగడం అసౌకర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వంటగదిలో బల్లులు తిరిగితే ఆహార పదార్థాల పరిశుభ్రతపై కూడా ఆందోళన కలుగుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా బల్లులను తరిమేయవచ్చు.

మిరియాల స్ప్రే : బల్లులకు ఘాటైన వాసనలు అస్సలు నచ్చవు. అందుకే మిరియాలను పొడి చేసి నీటిలో కలిపి ఒక స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బల్లులు ఎక్కువగా కనిపించే గోడలు, కిటికీలు, తలుపుల మూలలు, వంటగది ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. మిరియాల ఘాటు వాసన కారణంగా బల్లులు ఆ ప్రాంతాలకు రావు.

గుడ్డు పెంకులు: ఇంట్లో ఉడికించిన గుడ్ల పెంకులు మిగిలితే వాటిని పారేయకుండా బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచవచ్చు.

వెల్లుల్లి, ఉల్లిపాయల స్ప్రే: వెల్లుల్లి, ఉల్లిపాయలకు కూడా ఘాటైన వాసన ఉంటుంది. ఈ రెండింటిని మెత్తగా నూరి కొద్దిగా నీటిలో కలిపి స్ప్రే తయారు చేయాలి. దీనిని గోడలు, కిటికీలు, తలుపుల మూలలు, బల్లులు తిరిగే ప్రదేశాల్లో పిచికారీ చేయాలి. ఈ వాసన వల్ల బల్లులు ఆ ప్రాంతాల్లో తిరగకుండా ఉండే అవకాశం ఉంటుంది.

వేప ఆకుల పొగ: వేపను సహజ క్రిమిసంహారకంగా చాలా కాలంగా ఉపయోగిస్తున్నా రు. ఇంట్లో బల్లులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఎండిన వేప ఆకులను కాల్చి వచ్చే పొగను ఆ ప్రాంతానికి చేరేలా చేస్తే బల్లులు మాత్రమే కాకుండా కొన్నిరకాల కీటకాలు కూడా దూరమవుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -