మాటిస్తే మడమ తిప్పం..

– చేసి చూపడమే కాంగ్రెస్ నిజాం…
– 6గ్యారంటి కార్డ్ హామీ నేరవేర్చుతం.. 
– మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి
నవతెలంగాణ-డిచ్ పల్లి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 100రోజుల్లనే ప్రజల ముందు ప్రవేశపెట్టిన 6గ్యారంటి కార్డ్ లలో పేర్కొన్న వాటిని నేరవేర్చుతమని, ఒకసారి మాటిస్తే మడమ తిప్పకుండా చేసి చూపడమే కాంగ్రెస్ పార్టీ నిజామని, కెసిఆర్ రాష్ట్రాన్ని అదోగతి పలు చేశారని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోచేతికి బెల్లం అంటించి మిన్నకుండి పోయారని అలాంటి వారి మాటలు ప్రజలు మరోసారి వినేందుకు సిద్దంగా లేరని,ఎం గ్రామంలో చుసిన గతంలో ఇందిరమ్మ ఇళ్లే ఉన్నాయని ఇది మాటల ప్రభుత్వ మని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నేరవేర్చుతుందని,  రూపాలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ల ను అందజేస్తామని, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం పూర్తి సబ్సిడీతో అందజేస్తామని,విద్యార్థులందరికీ ఫిజు రియింబర్స్మెంట్ అందజేస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, నివాస గృహాలకు 200యునిట్లు ఉచితంగా అందజేసితీరుతామని మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు.శనివారం ఇందల్ వాయి మండలంలోని గుట్ట కింది తండా, డొంకల్, కోటల్ పల్లి, డొంకల్  తాండ, గౌరారం, లింగాపూర్,  గ్రామాలలో గడప గడపకూ కాంగ్రెస్… పల్లెపల్లెకూ భూపతిరెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నేలా 17న హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన విజయభేరి భాహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 6 డిక్లరేషన్ లను గ్యారెంటీ కార్డుగా ముద్రించి వాటిని ప్రజల సమక్షంలో ప్రకటించారని వివరించారు. దానిలో భాగంగానే ప్రతి గడప గడపకు ప్రకటించిన విధంగా ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.డబుల్ బెడ్ రూం లు మాటలకే పరిమితం అయ్యాయని వివరించారు. వరి క్వింటాలుకు రూ.2500 మద్దతు ధర, ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు 4000 చొప్పున పెన్షన్ అందజేస్తామని, ఇంటి పేద్ద మహిళలకు 2500వేలు ప్రతి నేలా,ఆరోగ్య శ్రీ పథకంలో 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు, రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.12 వేల సహాయం, రైతుబంధు పథకంలో భాగంగా 15000 రూపాయలు, ప్రతి ఏడాది 2లక్షల ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు పలు గ్రామాలలో డప్పు వాయిద్యాలు, హారతులతో మహిళలు ప్రజలు స్వాగతం పలికారు.కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి, గంగామని,  ఎన్ ఎస్ యుఐ రూరల్ ఇంచార్జీ ఆశిష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, నారాయణ, కర్స మోహన్, గంగక్క, ఎంపీ గంగారం, ప్రకాష్, విజయ్, శ్రీను, రాజన్న, గణేష్, సురేష్, శ్రీనివాస్, విజయ్, అంబర్ సింగ్, యాచారం సాయిలు, పీర్  సింగ్, రాజేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love