ఆశా కార్యకర్తలకు హెచ్ బీ ఎన్ సి కిట్ ల పంపిణీ….

నవతెలంగాణ – డిచ్ పల్లి 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయిలో మంగళవారం ఆశా కార్యకర్తలకు హెచ్ బీ ఎన్ సి (హెల్త్ బేస్డ్ నియోనేటల్ కేర్ )కిట్లను ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కిట్లు ప్రసవణ అనంతరం శిశువు తల్లి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించడానికి బాలింత ఇంటికి వెళ్లి వారికి తగు జాగ్రత్తలు వివరించవలసి ఉంటుందని వైద్యాధికారి సంతోష్ కుమార్ వివరించారు.ఈ కిట్లో మొత్తం తొమ్మిది వస్తువులు ఉంటాయని బేబీ వార్మర్, బేబీ వార్మర్ బ్లాంకెట్, టవల్, డిజిటల్ వాచ్, డిజిటల్ థర్మామీటర్, వేయింగ్ మిషన్, వేయింగ్ బ్యాగ్, టార్చ్ లైట్,
దోమల గొడుగు ఉంటాయని వివరించారు.ఈ కిట్టు తీసుకొని ఆశా కార్యకర్త ప్రసవానంతరము తల్లి ఇంటికి వెళ్లి శిశువు తల్లి టెంపరేచర్, పల్స్ రేట్, శిశువు బరువు తూచడం చేయాలన్నారు.ప్రతి ఒక్క ఆశా కార్యకర్త వారి ఇంటికి వెళ్లవల్సి ఉంటుందని సూచించారు. ప్రసవానంతరం తల్లికి, బిడ్డకు జరిగే అనివార్యమైన సమస్యల గురించి రక్షించుట కొరకు ఈ కిట్టు ఉపయోగపడు పడ్తుంది తెలిపారు. మండల ఆరోగ్య విస్తరణాధికారి వై.శంకర్ కిట్ లోని వస్తువులన్నిటి యొక్క ఉపయోగాలను వివరిస్తూ ప్రతి ఒక్క ఆశా కార్యకర్త ఈ వస్తువులను సరిగా వినియోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, పర్యవేక్షణ అధికారులు అక్బర్ అలీ, ఉమారాణి ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love