బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలి: ఐఎఫ్ టీయూ

Beedi workers should be given a living wage: IFTUనవతెలంగాణ – ఆర్మూర్
బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న  అన్ని కేటగిరీలకు సంబంధించిన బీడీ కార్మికులకు రే.4116 రూపాయల జీవన భృతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు సంబంధించిన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షనులో ప్రకటించిన ప్రకారం జీవన భృతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు కోరారు, బీడీ పరిశ్రమ సరిగా నడవకపోవడం వల్ల కార్మికులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు కావున వారికి రూ.4,116 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు, దీన్ని అమలు చేయకపోతే ఇకముందు ఆందోళన కార్యక్రమాలకు పోనుకోవాల్సి వస్తుందని అన్నారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కే.రాజేశ్వర్, జి.అరవింద్  తదితరులు పాల్గొ న్నారు.
Spread the love