Thursday, May 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'ఐకేపీ'నిలువు దోపిడీ..!

‘ఐకేపీ’నిలువు దోపిడీ..!

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి: ఆరుగాళం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులు ప్రతియేటా కుదేలవుతూనే ఉన్నారు. వ్యయప్రయాసాలకు ఓర్చుకుని అప్పులు చేసి పంటలు పండిస్తున్న రైతాంగం పంటను అమ్ముకునే సమయంలో నిలువు దోపిడికి గురవుతున్నారు. పరిపాలనలో ప్రభుత్వాలు మారుతున్నా.. అధికార యంత్రాంగం బదిలీ అవుతున్న రైతుల విధిరాత మారడంలేదు. ప్రభుత్వ నిబంధనలను నీరుగాస్తూ మండల పరిధిలోని రేగుపల్లి గ్రామంలో ఐకేపీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు సుమారు 7 కిలోల వరిధాన్యం అదనపు తూకం వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేయడం గురువారం వెలుగులోకి వచ్చింది.

దీంతో అగ్రహించిన రైతులు కొనుగోలు కేంద్రం నిర్వహాకుల నిలువు దోపిడిని నిరసిస్తూ రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ తిరుపతి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని రాస్తారోకోను విరమింపజేశారు. కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఎస్ఐ దృష్టికి తీసుకువెళ్లారు.

సంబధిత అధికారులతో ఎస్ఐ తిరుపతి మాట్లాడి రైతుల సమస్యలకు సత్వరం పరిప్కరించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్ర నిర్వహాకులు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా శాయశక్తుల కృషి చేయాలని, మిల్లులకు ధాన్యం తరలింపులో వాహనాల కొరతలేకుండా పోలీస్ శాఖపరంగా సహయసహాకారాలు అందిస్తామని, సంయమనం పాటిస్తూ రైతులు తమ పంట ధాన్యాన్ని మద్ధతు ధరకు విక్రయించుకోవాలని ఎస్ఐ తిరుపతి కోరారు.
తూకంలో బీహర్ హామాలీల తప్పిదాలు..
కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం తూకం వేయడానికి పలువురు బీహారీలు రేగులపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో హామాలీలుగా పని చేస్తున్నారు.భాష సమస్య తలెత్తి తప్పిదం జరిగిందని సంబధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.మరికొందరి రైతుల వరిధాన్యాన్ని సుమారు 37,38 కిలోలు హామాలీలు తూకం వేయడం ఇతర రైతుల వరిధాన్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని..దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అవేదన వ్యక్తం చేశారు.
బాధ్యురాలు తొలగింపు..
ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నిలువు దోపిడికి గురవుతున్నా..నిర్వహాకుల పర్యవేక్షణ లోపం స్పష్టమైంది.బస్తా తూకంతో సుమారు 40.600 కిలోలు తూకం వేయాలని ప్రభుత్వ నిబంధనలున్నా..బస్తాకు సుమారు 7 కిలోల వరిధాన్యం అదనపు తూకం వేసి రైతును దోపిడికి గురిచేశారని ఎపీఎం పర్శరాములు నిర్దారించడంతో బాధ్యురాలును తొలగించాలని అధేశాలిచ్చారు.
దోపిడిని అరికట్టాలి
అసౌకర్యాలకు నిలయంగా రేగుపల్లి వరిధాన్యం కొనుగోలు ఉంది. కొనుగోలు కేంద్రంలో రైతులకు టార్ఫాలిన్ అందుబాటులో లేవూ.వరిధాన్యం తూకంలో అక్రమాలకు,నిలువు దోపిడి చోటులేకుండా అధికారులు నిత్యం సందర్శించి పర్యవేక్షణ చేస్తూ అరికట్టాలి.
తిప్పారపు శ్రీనివాస్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి,బెజ్జంకి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -