Thursday, May 14, 2026
E-PAPER
Homeజాతీయంకేరళం నూతన సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక..

కేరళం నూతన సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేరళం రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు దీప్‌దాస్ మున్షీ, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో కేరళం కాంగ్రెస్‌లో ఒక తరం మారిపోయిందని, కొత్త శకం ఆరంభమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సీఎం రేసులో ఉన్న సీనియర్ నేత రమేశ్‌ చెన్నితాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి, సతీశన్‌ను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రాహుల్ సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రోజుల తరబడి సాగిన తీవ్రమైన లాబీయింగ్, చర్చల తర్వాత హైకమాండ్ సతీశన్ వైపే మొగ్గు చూపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -