అన్నదానంకు ముందుకు వచ్చిన ఇమ్మడి గోపి…

నవతెలంగాణ -డిచ్ పల్లి

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే శనివారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి అన్నదానం కు అయ్యే ఖర్చును బారించడనికి ముందుకు వచ్చినట్లు నల్లవెల్లి దుర్గామాత దేవి భక్తులు  తెలిపారు.దానిలో బాగంగా మంగళవారం నల్లవెల్లి గ్రామంలో నేలకోల్పిన దుర్గా మాత ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గా దేవి భక్తులు అన్నదాన విషయమై ఇమ్మడి గోపి దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే కాదనకుండా అన్నదానం కు అయ్యే ఖర్చును బారిస్తానని హామీ ఇచ్చారు. బక్తులు, గ్రామస్తులు ఇమ్మడి గోపి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇమ్మడి గోపి చేస్తున్న సేవలు మండలంలో మర్చి పోలేనివి అనిరాబోవు రోజుల్లో ఇంకా మరెన్నో సేవలు చేయాలని మంచి నాయకుడుగా ఎదగాలని తమంత కోరుతున్నట్లు గ్రామస్తులు, బక్తులు వివరించారు.

Spread the love