కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు అమలు

– పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ  కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండు నెలలు గడవకముందే మహిళల ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేయడం గర్వకారణం అన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రణాళిక బద్ధంగా అనతి కాలంలోనే అమలు చేస్తారని హామీ ఇచ్చారు. మేము వచ్చింది ప్రజాసేవ చేయడానికే తప్ప నాయకులుగా చెలామణి కావడానికి కాదు అని వ్యాఖ్యానించారు.  ప్రజా పాలనలో అమలవుతున్న ప్రతి పథకం అర్హులందరికీ అందుతాయని హామీ ఇచ్చారు. అమలవుతున్న పథకాల విషయంలో ప్రజలు దళారులను నమ్మవద్దని హితబోధ చేశారు. ఎవ్వరు లంచం అడిగిన నేరుగా తమను కలవాలని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా అన్నారు. తదుపరి రాగన్నగూడెం గ్రామంలో హైమాస్టర్ లైట్లు,క్రీడా ప్రగణం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్ నాయక్, ఎంపిఓ రామ్మోహన్, నాయబ్ తహశీల్దార్ సూర్య , సర్పంచులు గారె నర్సయ్య, గోవర్ధన్ రెడ్డి, కర్ర సరిత శ్రీనివాస్ రెడ్డి, నలమాస సారయ్య సూదులు దేవేందర్, చిన్నాల తారాశ్రీ రాజబాబు,ఎంపీటీసీలు ఐత రాంచందర్, రాధమ్మ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love