సుమారు 2.5 మిలియన్ టన్నులు ఇంపోర్ట్
దిగుమతి ఖర్చులు పెరిగితే ప్రభుత్వంపై ఆర్థిక భారం
ముందస్తు ప్రణాళికాలోపం కారణంగానే ఈ పరిస్థితి : మోడీ సర్కారుపై సర్వత్రా విమర్శలు
వ్యవసాయరంగంలో ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామం
న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలోని పరిస్థితు లను ముందుగానే అంచనా వేయటంలో విఫలమైన మోడీ సర్కారు చర్యలతో భారత్ భారీ మూల్యం చెల్లించు కుం టోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడి తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. చిరు వ్యాపారులను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టింది. వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టింది. ఇప్పుడు వ్యవసాయరంగం వంతు వచ్చింది. రెట్టింపు ధరలతో యూరియాను దిగుమతి చేసుకోవడానికి భారత్ సిద్ధమైంది. అయితే ఈ పరిస్థితి ముందస్తు ప్రణాళిక లోపాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అంటు న్నారు. ఇక దిగుమతి ఖర్చు పెరిగితే ప్రభు త్వంపై ఆర్థికభారం పెరుగుతుందని హెచ్చరి స్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆహార ధాన్యాల ధరలు కూడా పెరిగే అవకాశ ముంటుందని వారు అంచనా వేస్తున్నారు.
మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావంతో ఎరువుల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్ యూరియాను గత ధరలకంటే దాదాపు రెట్టిం పు ధరలకు దిగుమతి చేసుకోవడానికి ఒప్పు కుంది. ఖరీఫ్ పంటల విత్తనాల సీజన్ ముందే ఈ నిర్ణయం తీసుకోవడం దేశీయ వ్యవసాయ అవసరాల తీవ్రతను సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
రెట్టింపు ధరలకు భారీ దిగుమతులు
భారత్ ఒకే టెండర్‌లో సుమారు 2.5 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి చేసుకోబోతోంది. ఈ మేరకు తూర్పు తీరానికి 1.5మిలియన్ టన్నులు (టన్నుకు 959 డాలర్లు), పశ్చిమతీరానికి మరో 1 మిలియన్ టన్నులు (టన్నుకు 935డాలర్లు) డెలివరీ కాను న్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఇండియన్ పోటాష్ లిమిటెడ్ అంగీకరించినట్టు సమాచా రం. అయితే ఇరాన్‌పై యూఎస్, ఇజ్రా యిల్ యుద్ధానికి ముందు ఈ ధరలు టన్ను లకు 500డాలర్లుగానే ఉండేది. అంటే ఇప్పుడు భారత్ దా దాపు రెట్టింపు ధరలకు యూరియా ను దిగుమతి చేసుకుం టోందన్న మాట.
భారత్‌పై ప్రభావం
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద యూరి యా దిగుమతిదారుగా ఉంది. దేశీయ ఉత్పత్తి ప్రధానంగా సహజ వా యువుపై ఆధారపడి ఉం టుంది. ప్రస్తుత పరిస్థి తుల నేపథ్యంలో భారత్‌పై దిగుమతి ఖర్చులు పెరగ నున్నాయి. ఎరువుల సబ్సి డీ భారం ప్రభుత్వం మీద పడుతుంది. దీంతో రైతు లకు తక్కువ ధరలకు ఎరు వులు అందించడానికి అద నపు ఖర్చు అవుతుందని విశ్లేషకులు వివరిస్తున్నా రు. ఇక భారత్ భారీగా యూరియా కొనుగోలు చేయ డంతో ఇతర దేశాలు కూడా ఎరు వుల కోసం పోటీపడే అవకాశం ఉందని అంటున్నారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తం గా యూరియా ధరల లభ్యతపై ప్రభావం పడుతుందనీ, ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందనీ, సరఫరా కొరత మరింత తీవ్రమయ్యే అవకాశా లున్నాయని నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
విధానాల లోపం.. రైతులపై భారం
కేంద్రం ఎరువులను రైతులకు తక్కువ ధరలకు అందించేందుకు సబ్సిడీ ఇస్తోంది. కానీ దిగుమతి ఖర్చులు పెరిగితే సబ్సిడీ భారం ప్రభుత్వంపై భారీగా పెరుగుతుంది. ఆర్థిక లోటు తీవ్రమవుతుంది. చివరకు దీని ప్రభావం పరోక్షంగా రైతులపై లేదా పన్ను చెల్లింపు దారులపై పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. కేంద్రం దిగుమతుల నిర్ణయమనేది తక్షణ పరిష్కార మార్గమే తప్పితే దీర్ఘకాలిక వ్యూహం కాదని వివరిస్తున్నారు. ఇక మోడీ ప్రభుత్వం ఎప్పుడు వినిపించే ‘ఆత్మనిర్భర్ భారత్’.. ఎరువుల స్వయం సమృద్ధి విషయంలో లోపించిందని ప్రస్తుత పరిస్థితులతో స్పష్టమవుతోందని వారు అంటున్నారు. మొత్తానికి మోడీ సర్కారు తీరుతోనే దేశంలో ఎరువుల కొరత ఏర్పడిందని సర్వత్రా విరమ్శలు వెల్లువెత్తుతున్నాయి.



