2024 విద్యా సంవత్సరంలో శత శాతం విద్యార్థుల నమోదు జరగాలి

– కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌
నవతెలంగాణ – వనపర్తి
ఈ విద్యా సంవత్సరంలో ఏ ఒక్క బడి ఈడు పిల్లలు బడి బయట లేకుండా ప్రతి ఒక్కరికీ పాఠశాలలో చేర్పించా లని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు. శుక్ర వారం మధ్యాహ్నం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో బడి బాట కార్యక్రమం సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకా రం ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ఎలాంటి భేదభావం లేకుండా చదువుకునే హక్కు ప్రతి ఒక్క పిల్లలకు కల్పించడం జరిగిందన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, ప్రత్యేక పరిస్థితుల ప్రభావం వల్ల కొంత మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా చదువుకు దూరమవుతారని, ఎలాంటి వాటిని గుర్తించి పాఠ శాలల్లో పేర్లు నమోదు చేయించాలన్నారు. కొంత మంది తల్లిదండ్రులు వారి ఆర్థిక స్థోమత లేకున్నా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అప్పులు చేసి ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాణ్యమైన విద్యపై వారికి అవగాహన కల్పించాలన్నారు. బడిబాట కార్యక్రమం జూన్‌ 3 నుండి 19 వరకు నిర్వహిం చడం జరుగుతుందనీ, షెడ్యూల్‌ ప్రకారం రోజువారీ కార్యక్ర మాలు నిర్వహిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించా లని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించడం జరిగిందని, దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అలాంటప్పు డు ప్రభుత్వ పాఠశాలల్లోనే అధికంగా నమోదు చేయించాల న్నారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 3 నుండి 19 వరకు గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ, విద్యార్థులను గుర్తించి విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ వారికి ప్రభుత్వ పాఠశాలల్లో పేర్లు నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌.ఎల్‌. ఎన్‌ ప్రోగ్రాం ద్వారా సాధించిన ప్రగతిని గ్రామాల్లో వివరించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా పనిచేయాలని సూచించారు. ఉపాధ్యా యులు అందరూ గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉంటూ ఏ ఒక్క విద్యార్థి బడి బయట ఉండకుండా పాఠశాల ల్లో పేర్లు నమోదు చేయించాలని సూచించారు. విద్యార్థి యొక్క సామర్థ్యాలను గుర్తించి ఉన్నత స్థాయికి ఎదిగెందుకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ సంచిత్‌ గంగ్వార్‌, జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య అధ్యక్షులు, ఎంఈఓలు, మండల అభివద్ధి అధికా రులు, ఎంపీఓలు, క్లస్టర్‌ హెడ్మాస్టర్‌లు పాల్గొన్నారు.

Spread the love