మల్లారెడ్డిపల్లిలో చలివేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – వీణవంక
కరీంనగర్ కు చెందిన సిరివెన్నెల జన్మదినం సందర్భంగా అమ్మఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మావొల్ల యాదిలో.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు చనిపోగా వారి యాది సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు తాండ్ర శంకర్, మండల అధ్యక్షుడు గడ్డం నారాయణ గౌడ్ మాట్లాడారు. చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం గ్రామస్తులకు రాగి జావ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముద్దసాని శ్రీనివాస్, కొలకిపాక రామస్వామి, గోనెల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love