నవతెలంగాణ సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎఎంసి చైర్మన్ అబ్ధుల్ హది తహశీల్దార్ శ్రీదేవితో కలసి ప్రారంభించి మాట్లాడారు. పండించిన పంట దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రలో అమ్మి క్వింటాల్ కు రూ.2320/- మద్దతు ధర పొందాలన్నారు. ఆయన ఈ కార్యక్రమంలో మండల నాయకులు కరిపే విలాస్, మంతెన గంగారెడ్డి, శ్రావణ్ కుమార్, కొరుపెల్లి రాజు, లక్కడి కరుణ సాగర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.