కొచ్చి: ప్రముఖ గోల్డ్ లోన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇండెల్ మనీ కొత్తగా అండమాన్ నికోబర్ దీవులకు తమ కార్యకాలాపాలను విస్తరించినట్లు ప్రకటించింది. అక్కడ ఏర్పాటు చేసిన కొత్త శాఖలను ఆ సంస్థ ఛైర్మన్ మోహనన్ గోపాలకృష్ణన్ ప్రారంభించారని పేర్కొంది. దేశంలోని ప్రతి మూలకు చేరుకోవడం, ప్రతీ పౌరునికి సేవ చేయడంలో తమ నిబద్ధత, విజన్‌లో ఇది భాగమని ఆసంస్థ సిఇఒ ఉమేష్ మోహనన్ పేర్కొన్నారు.