టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం పలుమార్లు వర్షం అంతరాయం మధ్య ఆగుతూ సాగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌..భారత్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో మైదానం చిత్తడిగా మారడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బట్లర్‌..లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ(39 బంతుల్లో 57, 6ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు సూర్యకుమార్‌యాదవ్‌(36 బంతుల్లో 47, 4ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. మిడిలార్డర్‌లో హార్దిక్‌పాండ్యా(23) ఫర్వాలేదపించగా, దూబే(0), పంత్‌(4), కోహ్లీ(9) ఘోరంగా నిరాశపరిచారు. క్రిస్‌ జోర్డాన్‌(3/37)కు మూడు వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో స్నిన్నర్లు అక్షర్‌పటేల్‌(3/14), కుల్దీప్‌యాదవ్‌(3/19) ధాటికి ఇంగ్లండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది. అక్షర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

Spread the love