28న బంగ్లాదేశ్‌ పర్యటనకు భారత మహిళలు

28న బంగ్లాదేశ్‌ పర్యటనకు భారత మహిళలుముంబయి: ఈనెల 28న భారత మహిళలజట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా జట్టు బంగ్లాతో ఐదు టి20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ను భారత-బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ బోర్డులు అధికారికంగా ధృవీకరించాయి. 28, 30, మే 9న సిగ్స్‌ వేదికలో జరిగే మ్యాచ్‌లు ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరగనున్నట్లు బంగ్లాబోర్డు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సిగ్స్‌ వేదికగా 28న జరిగే తొలి మ్యాచ్‌లో ఈ సిరీస్‌ ప్రారంభమౌతుందని.. మే 9న అదే వేదికలో జరిగే చివరి మ్యాచ్‌తో సిరీస్‌ ముగియనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
షెడ్యూల్‌…
ఏప్రిల్‌ 28 : తొలి టి20(సిగ్స్‌)
ఏప్రిల్‌ 30 : రెండో టి20(సిగ్స్‌)
మే 2 : మూడో టి20(సిగ్స్‌ ఔటర్‌)
మే 6 : నాల్గో టి20(సిగ్స్‌ ఔటర్‌)
మే 9 : ఐదో టి20(సిగ్స్‌)

Spread the love