సింధు శుభారంభం

– సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పివి సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సింధు వరుససెట్లలోనూ డెన్మార్క్‌ షట్లర్‌ను చిత్తుచేసి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లింది. తొలిరౌండ్‌లో సింధు 21-12, 22-20తో కేవలం 44 నిమిషాల్లోనే హోమార్క్‌(డెన్మార్క్‌)ను ఓడించింది. రెండోరౌండ్‌లో సింధుకు గట్టి ప్రతిఘటన ఎదురుకానుంది. స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌తో సింధు తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు రారు మూడుసెట్ల హోరాహోరీ పోరులో గెలుపొందగా.. లక్ష్యసేన్‌ టాప్‌సీడ్‌ అక్సెల్సన్‌ చేతిలో పోరాడి ఓడాడు. ప్రణరు 21-9, 18-21, 21-9తో కర్రాజి(జర్మనీ)ని చిత్తుచేయగా.. లక్ష్యసేన్‌ 13-21, 21-16, 13-21తో అక్సెల్సన్‌ చేతిలో ఓడాడు. రెండోరౌండ్‌లో ప్రణరు.. జపాన్‌కు చెందిన నిషిమోటోతో తలపడనున్నాడు.

Spread the love