– హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న
నవతెలంగాణ – తూప్రాన్ రూరల్ / మనోహరాబాద్
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చెక్‌పోస్ట్‌లో పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. కేటీఆర్ తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారని పోలీసులు తెలిపారు. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు.