Sunday, July 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాలాలయంలో ఉత్సవ మూర్తుల ప్రతిష్టాపన

బాలాలయంలో ఉత్సవ మూర్తుల ప్రతిష్టాపన

- Advertisement -

కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ నిర్మాణ దాత, ఎమ్మెల్యే..
నవతెలంగాణ – ముధోల్ 

దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కళాపకర్షణ పూజలు అత్యంత వేడుకగగా నిర్వహించి బాలాలయంలో ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల మధ్య వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వేడుకగా ప్రతిష్టాపించారు. శృంగేరి పీఠాధిపతులు ఇచ్చిన (దారు కర్రలు) ఉత్సవ మూర్తులకు తెల్లవారుజామున  శృంగేరి నుంచి వచ్చిన పండితులు ఆలయ అర్చకులు వేద పండితులు వేద పండితుల వేద మంట్రోచ్చారణల మధ్య అభిషేక పూజలు చేసి అమ్మవారి సన్నిధిలో సంకల్పం గణపతి పూజ కళాపర్షణ పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా బాలాలయంలోకి తీసుకెళ్లి ప్రతిష్టాపించారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటెల్, ప్రధాన ఆలయ నిర్మాణ దాత సురపనేని సునంద్, పద్మప్రియ దంపతులను ఆలయ ఈఓ అంజని దేవి పట్టు వస్త్రాలతో సత్కరించారు. వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -