నవతెలంగాణ – జుక్కల్
ఇటీవల కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకు ఖరీఫ్ పంటలపై రైతులకు ఆశలు రేకెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా మండల పరిధిలోని గ్రామాలలో అడపా దడపా పడుతున్న వర్షాలకు నాటిన విత్తనాలు మొలకెత్తాయి. దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా వర్షాలతో పంటలకు ఎలాంటి నష్టం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ. 20,000/- లకు పైగా సాగు పెట్టుబడి పెట్టారు. విత్తనాలు, ఫర్టిలైజర్, పలు వ్యవసాయ ఎరువుల నిమిత్తం ఈ దాప రైతన్నలు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో రైతులు ఈ ఏడాది పత్తిసాగుకే అధిక శాతం మొగ్గు చూపారు. రెండవ పంటగా లేదా అంతర్గత పంటలుగా సోయా, పప్పు దినుసుల పంటలు తదితర పంటలు సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు.
మొలకెత్తిన ఖరీఫ్ విత్తనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



