ఇంటర్‌ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచాలి

– ఇంటర్‌ బోర్డుకు బీసీ సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి జయప్రదబాయిని గురువారం హైదరాబాద్‌లో బీసీ సంఘాల ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల 15వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. తక్షణమే ఇంటర్‌ బోర్డు అధికారులు విద్యార్థులకు అందుబాటులో హాల్‌టికెట్లను ఉంచాలని కోరారు. కాలేజీలతో సంబంధం లేకుండా వెబ్‌సైట్‌లో ఉంచాలని తెలిపారు. ఫీజులు చెల్లించడం లేదనే సాకు చూపించి కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఫీజు కట్టిన వారికి హాల్‌టికెట్లు ఇస్తూ ఫీజు కట్టని వారికి నిరకారిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్‌ బోర్డు అధికారులు తక్షణమే స్పందించిక పోతే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముందని తెలిపారు. శుక్రవారం నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాతామని జయప్రదబాయి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాలేజీలతో సంబంధం లేకుండా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావొచ్చని సూచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధి బృందంలో తాటికొండ విక్రం, గొడుగు మహేష్‌ యాదవ్‌, కనకాల శ్యాంకుర్మ, ఈడిగ శ్రీనివాస్‌ గౌడ్‌, సాయితేజ్‌, ఇంద్రం తదితరులున్నారు.

Spread the love