గురుకుల పాఠశాలలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరడానికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పదవ తరగతిలో 9.0 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈనెల 7వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు ఒరిజినల్ టి సి, కుల, ఆదాయ పత్రాలు, మార్కుల మెమో పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

Spread the love