పర్యావరణ పరిరక్షణ దినోత్సవం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్ ప్రక్కన స్టెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిపిఎం సెర్ప్ శ్రీనివాస్ జిల్లా సమాఖ్య అధ్యక్షులు విప్లవ కుమారి పాల్గొని విద్యార్థాలకు పర్యావరణం వల్ల లాభాలను వివరించారు. చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు.అనంతరం స్టెట్ బ్యాంకు ఆవరణలో మొక్కలను నాటారు.ఈ కార్యాక్రమంలో సంస్థ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, రంజిత, నాజీనా, రవి, లక్షణ్, రామకృష్ణ, హౌస్ వైరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love