ఏడోసారి వడ్డీ రేట్లు యథాతథం

ఏడోసారి వడ్డీ రేట్లు యథాతథం– రెపోరేటు 6.5 శాతంగా కొనసాగింపు
– ఆర్బీఐ ఎంపీసీ భేటీలో నిర్ణయం
ముంబయి : హెచ్చు వడ్డీ రేట్ల నుంచి ఈ దఫా అయినా ఉపశమనం లభిస్తుందని ఆశించిన రుణ గ్రహీతలకు ఆర్బీఐ నిరాశనే కల్పించింది. వరుసగా ఏడో సారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ శుక్రవారం ముగిసింది. ఈ సందర్బంగా ఆ వివరాలను శక్తికాంత దాస్‌ మీడియాకు వెల్లడించారు. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ ఉంచేందుకు ద్రవ్య పరపతి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామక్రమానికి ఆర్బీఐ ప్రయాణానికి దగ్గరి సంబంధం ఉందన్నారు. సంస్థపై ఉన్న బహుళ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త సవాళ్లు, అంశాలను స్వీకరిస్తామన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆర్బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో వ్యాఖ్యానించారు ఆర్థిక వృద్థి గాడిలో పడిందని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. 2023 డిసెంబర్‌లో 5.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. గడిచిన జనవరి, ఫిబ్రవరి నెలల్లో 5.1 శాతానికి తగ్గిందన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత వృద్థి రేటు 7 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత జూన్‌ త్రైమాసికంలో 7 శాతం, సెప్టెంబరులో 6.9 శాతం, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 7 శాతం చొప్పున వృద్థి రేటు ఉండొచ్చన్నారు. ప్రపంచ వృద్థి పుంజుకుంటోందన్నారు. ముడి చమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. గ్లోబల్‌ జీడీపీలో రుణాల నిష్పత్తి అధికంగా ఉండటంతో అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. గ్రామీణ డిమాండ్‌ పుంజుకుంటోందన్నారు. ఇది 2024-25లో ఆర్థిక వృద్థికి తోడ్పడుతుందని దాస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.
పెరిగిన పసిడి నిల్వలు..
ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. మార్చి 2022 నాటికి విదేశీ మారక నిల్వల్లో 51.487 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం ఉంది. మార్చి 2023 నాటికి ఉన్న విలువతో పోలిస్తే 6.287 బిలియన్‌ డాలర్లు అధికంగా నమోదయ్యింది. గడిచిన ఒక్క జనవరిలోనే 8.7 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది.
ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు సులభం..
సాధారణ వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతంగా అంచనా వేశారు. 2023లో భారత రూపాయి అత్యల్ప ఒడుదొడుకులను చవి చూసిందన్నారు. ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానుందని దాస్‌ తెలిపారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఓ మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తేనున్నామన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించిందని.. ప్రస్తుతం ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయవచ్చన్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం లేదా కొనడం చేయవచ్చన్నారు. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ నుంచి రూ.14.13 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నార

Spread the love