మనదో స్టైల్ అనిపించుకోవాలని ఆరాటపడేవారి ఇంటికి తగ్గ ఫర్నిచర్ డిజైన్స్ ఎన్నో మార్కెట్లో లభిస్తున్నాయి. గార్డెన్, హాల్, డ్రాయింగ్ హాల్, వంటిల్లు ఇలా అన్ని రకాల రూముల్లో సరికొత్త డిజైన్స్ వెల్లివిరుస్తున్నాయి. గది సైజుని బట్టి, అభిరుచిని బట్టి, బడ్జెట్‌ని దష్టిలో పెట్టుకుని ఎన్నో విభిన్న రూపాల్లో అన్ని రకాల ఫర్నిచర్ లభ్యమవుతోంది. గహ నిర్మాంణంలో వాస్తుతో సమానంగా ఇంటీరియర్ డిజైన్‌కూ ప్రాముఖ్యతను ఇస్తారు. బెడ్ రూం నుంచి బాత్రూం వరకూ ఇంట్లో ప్రతి అంశం ఆకట్టుకోవలసిందే. ప్లాస్టిక్, చెక్క, కేన్ ఫర్నీచర్ ఐటమ్స్‌కే ప్రాధాన్యత పెరుగుతోంది. కార్నర్ టేబుల్స్, సెంటర్ టేబుల్స్ వంటివి చాలా రకాలు తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిందే. ఫర్నీచర్ ఐటమ్స్ మల్టిపుల్ యూజర్స్‌గా ఉపయోగపడుతున్నాయి. కుర్చీలు, సోఫాలు, టేబుల్స్, బెడ్స్, నైట్స్టాండ్స్, క్యాబినెట్స్ కాంటెంపరరీ ఫర్నీచర్ అందుబాటులో ఉన్నాయి. గది అందం ద్విగుణీకతం కావాలంటే, అలంకరణ సాదాసీదాగా.. అంటే సింపుల్‌గా ఉండాలి. ప్రత్యేకంగా లభించే ఫర్నీచర్‌తో అలంకరించాలి. మన క్రియేటివిటీకి ఈ ఫర్నిచర్ డిజైనూ తోడైతే
ఇంటికి అందమూ హుందాతనం వాటంతటవే వచ్చేస్తాయి.
– ఆనంద ‘మైత్రేయ’మ్
హైదరాబాద్