ఇంట్రబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌

Irritable Bowel Syndromeఇంట్రబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (IBS) అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక జీర్ణ సంబంధిత వ్యాధి. ఇది ముఖ్యంగా కడుపు నొప్పి, మలబద్ధకం (Constipation), లూజ్‌ మోషన్‌, (Diarrhea), గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కలిగించగలదు. IBS కి నిర్దిష్ట కారణం తెలియదు కానీ జీవనశైలి, మానసిక ఒత్తిడి, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు దీని తీవ్రతపై ప్రభావం చూపుతాయి.
ఆహారం IBS ను ప్రేరేపించే ప్రాథమిక కారణాల్లో ఒకటి. కొన్ని ఆహార పదార్థాల అలవాట్లు IBS లక్షణాలను మరింత ఉధతం చేస్తాయి. మరికొన్ని IBS ను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి, IBS బాధితులు తమ ఆహారాన్ని సరైన విధంగా నియంత్రించుకోవడం ఎంతో అవసరం.
IBS కు దారితీసే 5 ఆహారపు అలవాట్లను, అలాగే IBS ను సరిచేసే 5 ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను తెలుసుకుందాం. సరైన ఆహార నియంత్రణ ద్వారా IBS లక్షణాలను తగ్గించుకోవచ్చు.
IBS కి దారితీసే 5 ఆహారపు అలవాట్లు
1. అధిక నూనె, ఫ్యాటీ ఆహారాలు
ఫ్యాటీ ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. ఇది కడుపు నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఫ్రైడ్‌ ఫుడ్స్‌, చీజ్‌, ప్రాసెస్డ్‌ స్నాక్స్‌ వంటి ఆహారాలు IBS లక్షణాలను ప్రేరేపించవచ్చు. దీని వల్ల జీర్ణాశయం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది.
2. ఎక్కువ క్యాపెయిన్‌, ఆల్కహాల్‌
కాఫీ, టీ, సోడా వంటి క్యాఫినేటెడ్‌ పానీయాలు, ఆల్కహాల్‌ జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇవి అధికంగా తీసుకున్నప్పుడు కడుపు నొప్పి, లూజ్‌ మోషన్‌ కలిగి IBS కు కారణం కావచ్చు.
3. పాల పదార్థాలు
లాక్టోజ్‌ ఇన్టాలరెన్స్‌ ఉన్న వ్యక్తులకు, పాలు, డెయిరీ ఉత్పత్తులు IBS లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ఇవి గ్యాస్‌, బ్లోటింగుకు దారితీస్తుంది..
4. హై FODMAP ఆహారాల ప్రభావం

FODMAP అనేది (ఫెర్మెంటబుల్‌ ఒలిగో-, డై-, మోనో-సాకరైడ్స్‌, పాలీఓల్స్‌) ఇవి శరీరంలో పూర్తిగా జీర్ణం చేయలేకపోయే కొన్ని ప్రత్యేకమైన కార్బోహైడ్రేట్లు. హై-FODMAP ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్‌ (Gas), కడుపు ఉబ్బరం (Bloating), జీర్ణ సమస్యలు (Indigestion), మలబద్ధకం లేదా, లూజ్‌ మోషన్‌ (Constipation/ Diarrhea) వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఉదా: బ్రెడ్‌, కేకులు బిస్కెట్లు, సోడా, ప్యాకెజ్డ్‌ జ్యూసులు, క్యాండీలు, ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్లు.
5. అధిక తీపి పదార్థాలు :
స్వీట్లు, ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్లు, ఎక్కువ ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, అధిక చక్కెర లేదా ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్లు IBS లక్షణాలను మరింత పెంచవచ్చు. ముఖ్యంగా సర్బిటాల్‌, మాన్నిటాల్‌ వంటి షుగర్‌ సబ్‌సిట్యూట్‌లు కడుపును అసౌకర్యానికి గురిచేస్తాయి.
ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ లో ఉన్న ఆర్టిఫిషియల్‌ ఎడిటివ్స్‌, స్పైసీ ఫుడ్స్‌లో ఉన్న కాప్సైసిన్‌ జీర్ణ వ్యవస్థను ప్రేరేపించి, IBS లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.
IBSని సరిచేసే 5 ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
IBS ఉన్నవారు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. ఇక్కడ కొన్ని మంచి ఆహారపు అలవాట్లు వివరించబడ్డాయి:
1. ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం
తాజా కూరగాయలు, పండ్లు, గంజి, ఉదా: బంగాళాదుంప , కారెట్‌ , బీట్‌రూట్‌, పాలకూర వంటి ఆహారాలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఫైబర్‌ మలాన్ని మెత్తగా చేయడం ద్వారా IBS ను నియంత్రిస్తుంది.
సోల్యూబల్‌ ఫైబర్‌ తీసుకోవడం: సోల్యూబల్‌ ఫైబర్‌ (ఓట్స్‌, బార్లీ, పండ్లు వంటివి) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. IBS లక్షణాలను తగ్గిస్తుంది. కానీ, ఫైబర్‌ తీసుకోవడం క్రమంగా పెంచాలి.
లో-ఫోడ్మ్యాప్‌ డైట్‌: FODMAPs (ఫెర్మెంటబుల్‌ ఒలిగో-, డై-, మోనో-సాకరైడ్స్‌, పాలీఓల్స్‌) అనేది కొన్ని కార్బోహైడ్రేట్లు. ఇవి జీర్ణ వ్యవస్థలో గ్యాస్‌, బ్లోటింగ్‌ వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
లో-ఫోడ్మ్యాప్‌ డైట్‌ అనుసరించడం ద్వారా IBS లక్షణాలను తగ్గించవచ్చు.
ఉదా: క్యాప్సికం, కీరా , బొప్పాయి, ముస్క్‌మెలన్‌, ద్రాక్ష, బాస్మతి రైస్‌, బ్రౌన్‌ రైస్‌ గ్లూటెన్‌-ఫ్రీ బ్రెడ్‌, గుడ్లు, చికెన్‌, చేపలు, ఆకుకూరలు, కొబ్బరి నీరు
ప్రోబయోటిక్స్‌: ప్రోబయోటిక్స్‌ (ఫెర్మెంటేడ్‌ ఫుడ్స్‌, పెరుగు కిఫర్‌, టెంపే వంటి ఆహారాలు) జీర్ణ వ్యవస్థలో ఉన్న మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. IBS లక్షణాలను తగ్గిస్తుంది.
నీరు తగినంత తాగడం: నీరు తగినంత తాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు అవసరం.
సమతుల్య ఆహారం: సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రత్యేకించి తక్కువ ఫాట్‌, తక్కువ షుగర్‌ ఉన్న ఆహారాలు, IBS లక్షణాలను నివారించడంలో సహాయపడతాయి. తాజా పండ్లు, కూరగాయలు, లీన్‌ ప్రోటీన్లను ఆహారంలో చేర్చడం ముఖ్యం.
”గట్‌ అనేది హక్షలిస్టిక్‌ హెల్త్‌కు అపెక్స్‌ సెంటర్‌”
”మీ జీర్ణవ్యవస్థ బాగుంటే మీ ఆరోగ్యం బాగున్నట్లే”.
వచ్చేవారం మళ్ళీ కలుద్దాం.

Dr.Prathusha. Nerella
MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314

Spread the love