షిఫ్ట్ టైమింగ్ లను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఐఎన్ టీయూసీ

– అర్జీ-3 ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – రామగిరి
సింగరేణి ఆర్ జి-3 ఏరియాలో షిఫ్ట్ టైమింగ్ లను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఐఎన్టీయూసీ యూనియన్ ఆర్ జి-3 ఏరియా ఉపాధ్యాయులు కోట రవీందర్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఆదివారం ఐ ఎన్ టి సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,   ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ఐడిల్ రన్ లో డంపర్లలో ఏసీలు కూడా పనిచేయడం లేదని, వర్క్ షాప్ లో యంత్రాల మీద పనిచేసే పరిస్థితి లేదని, రెస్ట్ షెల్టర్లలో కూడ ఉండే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కాబట్టి ఉదయం షిఫ్ట్ 7గంటల నుండి మద్యాహనం 1 వరకు, రెండవ షిఫ్ట్ 4 గంటల నుండి 11 గం టల వరకు ఉండాలని మాత్రమే కోరడం జరిగిందని, కానీ యాజ మాన్యం ఇచ్చినటువంటి షిఫ్ట్ టైమింగును ఐఎన్టియుసి పక్షాన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని, రవీందర్ రెడ్డి అన్నారు. అలాగే షిఫ్ట్ టైమింగ్ ల విషయం సింగరేణి సంస్థ యాజమాన్యంతో సోమవారం మాట్లాడి పని వేళలు మారుస్తామని కాబట్టి కార్మిక సోదరులు గమనించి సోమవారం ఎదా విదిగా విధులకు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు గడ్డం తిరుపతి, బ్రాంచ్ సెక్రటరీ ఎన్ శ్రీనివాసరావు, పిట్ కార్యదర్శులు ఓసి పి-1 వెంకట్ స్వామి, ఈ. సదానందం, ఓసిపి-2 రామిండ్ల  మనోహర్, కె నరసింహ చారి, కార్యదర్శి డి మంగయ్య, ఎ ఎల్ పి అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సర్వన్ నాయక్, నాయకులు మహమ్మద్ రఫీ, మడ్డి రాజ్ కుమార్, బత్తుల రమేష్, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love