బెటి బచావో బెటీ పడవో కరపత్రం ఆవిష్కరణ 

నవతెలంగాణ- దుబ్బాక 
ఆడపిల్లలను రక్షిద్దాం- ఆడపిల్లలను చదివిద్ధాం, ప్రతి ఆడపిల్ల అమూల్యమైనది వారినీ చదివించి దేశాన్ని శక్తివంతం చేద్దామనే నినాదంతో బెటి బచావో బెటీ పడవో అనే వాల్ పోస్టర్ ఐసిడియస్ సిడిపిఓ ఆఫీసర్ చంద్రకళ మంగళవారం  దుబ్బాక వంద పడకల ఆసుపత్రి లో కరపత్రాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో ఆడపిల్లను రక్షిద్దాం- ఆడపిల్లను చదివిద్ధామని ఆడపిల్లకి జన్మనిచ్చిన తల్లి తండ్రుల కుటుంబ సభ్యులకు  స్వీట్స్ మరియు పండ్లు పంపిణీ  చేశామన్నారు.అలాగే బాలికల యొక్క రక్షణ గురించి తల్లిదండ్రులకు వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్  డాక్టర్ ఐశ్వర్య, జిల్లా సాధికారత కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ వాసవి, జెండర్ స్పెషలిస్ట్ లు లావణ్య పద్మ, పోషణ అభియాన్ జిల్లా కో-ఆర్డనేటర్ వెంకట ప్రసాద్,దుబ్బాక బ్లాక్ కో ఆర్డినేటర్ శ్యామ్సన్, హాస్పటిల్ స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.
Spread the love