శ్రీ సమ్మక్క- సారలమ్మ పూజారులు, వడ్డెలు కులస్తుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – తాడ్వాయి 
శ్రీ సమ్మక్క- సారలమ్మ పూజారులు, వడ్డెలు కులస్తుల సంఘం 2024 క్యాలండర్ ను మంగళవారం ఐటిడిఏ పిఓ అంకిత్ చేతులమీదుగా, సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన సురేందర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూజార్ల సంఘం ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్ మాట్లాడుతూ మేడారం మహా జాతరలో కోటికి పైచిలుకు భక్తులు వస్తారని అన్నారు. మేడారం మహా జాతరకు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. జంపన్న వాగులో గజ ఈతగాడ్లు గా గిరిజనులనే నియమించాలని ఐటిడిఏ పిఓ అంకితను కోరారు. గిరిజన మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు. వందకు వందశాతం ఆదివాసి గిరిజనులనే జంపన్న వాగు వద్ద గజ ఈతగాళ్ళుగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుపాకుల తుపాకులగూడెం మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఆలం భాస్కర్, పాలెం గిరిజన మత్స్యకారుల సంఘం అధ్యక్షులు సోలం ఆదినారాయణ, ఆశన్నగూడ ఎల్లాపూర్ గిరిజన మత్స్యకారుల సంఘం అధ్యక్షులు వట్టం విశ్వనాథం, గోవిందరావుపేట మండలం సంఘం అధ్యక్షులు రేగ కృష్ణారావు, వివిధ మత్స్యకారుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love