కేవీపీఎస్ మహనీయుల స్ఫూర్తి క్యాలండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ –  హాలియా
–  జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను

సమాజంలో వేలునుకున్న అసమానతలు కుల వివక్షకు వ్యతిరేకంగా తమ జీవితాంతం పోరాడిన మహనీయులు సామాజిక తత్వవేత్తలు మనందరికీ మార్గదర్శకులని, ఆ మహనీయుల స్ఫూర్తితో కేవీపీఎస్ ముందుకు సాగుతూ సామాజిక ఉద్యమాలు చేస్తుందన్నారు. మంగళవారం హాలియా సుందరయ్య భవన్ లో కేవీపీఎస్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను కేవీపీఎస్ జిల్లా నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మాట్లాడుతూ మహనీయుల స్ఫూర్తితో కేవీపీఎస్ నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమాలు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని, ప్రతిఘటన శక్తిని పెంపొందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కోసం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం కేవీపీఎస్ పోరాటాలు నిర్వహించి అనేక చట్టాలను సాధించిందని అన్నారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా రావలసిన నిధులు పక్కదారి పడుతున్నాయని, దళిత, గిరిజనులకు అందవలసిన నిధులను దారి మళ్లించకుండా దళితుల అభ్యున్నతికే ఖర్చు చేయాలని అన్నారు. నేటికీ కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనం సామాజిక అణిచివేతలకు వ్యతిరేకంగా కేవీపీఎస్ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు, దొంతాల నాగార్జున, దొరేపల్లి మల్లయ్య, మేకలవెంకన్న, రవి, చిన్న కొమ్ము జీవన్ , వీరయ్య,కొండేటి సైదులు, కొండేటి క్రిష్ణ సైదులు, తదితరులు పాల్గొన్నారు
Spread the love