
మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.రోజా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల సెట్ కామన్ ఎంట్రన్స్ పరిక్ష నిమిత్తం ఈ నెల 2 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గిరిజన బాలబాలికలు సద్వినియోగం చేసుకోగలరని సూచించారు.