ఇరాన్ అధ్యక్ష పదవికి జులై 5న మళ్లీ పోలింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడి ఎన్నికకు ఈనెల 28న జరిగిన పోలింగ్‌లో దేశచరిత్రలోనే అతి తక్కువ ఓటింగ్(39.9%) నమోదైంది. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో 50%కి పైగా సాధించిన వారే అధ్యక్షులవుతారు. కానీ తాజా ఎన్నికలో అలా జరగలేదు. దీంతో జులై 5న మరోసారి పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిలో ఖలిబాఫ్ తాజాగా రేసు నుంచి తప్పుకుని జలీలీకి మద్దతు ప్రకటించారు.

Spread the love