అర్హులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంబేద్కర్ కు వినతి

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని తుంగిని గ్రామంలో గృహలక్ష్మి, దళిత బంధు మరియు బీసీ బందు పథకాలు అర్హులకు ఇవ్వాలని గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. గ్రామంలో గృహలక్ష్మికి 46 మంది దరఖాస్తులు చేసుకోగా 46 మందిని అర్హులుగా అధికారులు గుర్తించగా 18 మంది బిఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యులకు మాత్రమే గృహలక్ష్మి మంజూరు కావడంతో గ్రామస్తులు మంగళవారం సర్పంచ్ భర్త రవీందర్ రావును ప్రశ్నించారు. అనంతరం నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి గ్రామస్తుడు రాజేశ్వర్ మాట్లాడుతూ అర్హులైన వారికి కాకుండా బిఆర్ఎస్ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు దళిత బంధు, బీసీ బందు మరియు గృహలక్ష్మి అందిస్తారా అని ప్రశ్నించారు. ఒకే ఇంట్లో రెండు, మూడు పథకాలు ఇస్తూ వారే లబ్ధి పొందుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఓట్లు అవసరం లేదా ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వెంటనే అధికారులు స్పందించి అనర్హులైన లబ్ధిదారులను తొలగించి అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Spread the love