అంగన్వాడీ ఉద్యోగుల భిక్షాటన

నవతెలంగాణ  -కమ్మర్ పల్లి
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. మండల కేంద్రంలోని హాస కొత్తూర్  చౌరస్తా వద్ద కొనసాగిస్తున్న నిరవధిక సమ్మె శనివారంతో 20వ రోజుకు చేరుకుంది.  సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు బిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్స్ అండ్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, రూ.26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు మంజుల, అంగన్వాడీ టీచర్లు  బాలమణి, శోభ, పద్మ, సువర్ణ, అంజనీ దేవి, మంజుల రాణి, టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love