నిజామాబాద్ లో ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు 

– పోలీస్ కమీషనర్ వెల్లడి
నవతెలంగాణ- కంటేశ్వర్ 
మంగళవారం ప్రధానమంత్రి మోడీ నిజామాబాద్ జిల్లాలో‌ పర్యటించనున్నారు.‌ ఈ నేపథ్యంలో ఆర్మూర్, నిర్మల్, అదిలాబాద్, మెట్పల్లి, జగిత్యాల్, కరీంనగర్, కామారెడ్డి, మెదక్ వైపుల నుండి సభకు వచ్చే వాహనాదారులకు కంఠేశ్వర్ బైపాస్ లో ప్రజలను దింపి అక్కడి నుండి ఖాళీ వాహనాలు ఉమెన్స్ కాలేజి వద్ద గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో  పాల్టెక్నిక్ గ్రౌండ్, సి.ఎస్.ఐ కాలేజి గ్రౌండ్ లో తమ తమ వహానాలు క్రమ పద్దతిలో పార్కింగ్ చేయుటకుగాను స్థలంను కేటాయించడం జరిగినది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట్, జుక్కల్ నియోజకవర్గం, బోధన్, బైంసా, ముధోల్ వైపుల నుండి సభకు వచ్చే ప్రజల వాహనాలు అర్సాపల్లి – రైల్వే గేటు – ఖానాపూర్ చౌరస్తాలో దింపి తమకు కేటాయించిన దుబ్బా ద్వారా శ్రద్ధాన్నంద్ గంజిలో మీ వాహానాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసుకోగలరు. ప్రజలు పోలీస్ శాఖ  సూచనలు తప్పకుండా పాటించగలరు. వీఐపీ వాహనాలకు జి.జి కాలేజీ ముందు భాగంలో గల హన్మాన్ దేవాలయం వెనుకభాగంలో స్థలం కేటాయించడం జరిగింది. అక్కడ పార్కింగ్ చేసుకోగలరు.హన్మాన్ మందిరం ముందు వి.వి.ఐ.పిల సంబంధించిన వాహనాలకు పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగింది.సభకు వచ్చే ప్రజల వాహనాదారులకు శ్రద్ధానంద్ గంజ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్, పాల్టెక్నిక్ గ్రౌండ్, సి.ఎస్.ఐ గ్రౌండ్ లలో వాహనాలను నిలుపుకోగలరు. తేది: 3-10-2023 నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎట్టి పరిస్థితిలో బైపాస్ రోడ్డు పైకి రాకుండదు. సభకు వచ్చే వాహనాల తప్ప ఇతర వాహనాలు ఏవీ కూడా రాకూడదు. ఇతర వాహనాలు అర్సపల్లి ద్వారా పూలాంగ్ నుండి వెళ్లిపోవచ్చును. ఆర్మూర్ వైపు నుండి సభకు వచ్చేవి. తప్పఇతర వాహనాలు నిజామాబాద్ వైపు రాకూడదు. అవసరం బట్టి మరోక రూటు మానిక్ భండార్, పుప్పాలపల్లి, సికింద్రాపూర్ ద్వారా జాతీయ రహదారి కి చేరుకోవచ్చును.కామారెడ్డి, డిచ్పల్లి వైపుల నుండి సభకు వచ్చే వాహనాలు బైపాస్ ద్వారా కంఠేశ్వర్ బైపాస్ లో ప్రజలకు దింపి పైన చూపించిన స్థలంలోనే పార్కింగ్ చేసుకోగలరు. ఇతర వాహానాలు బైపాస్ రోడ్డు ద్వారా రాకుండా డిచ్పల్లి, ముల్లంగి, ముప్కాల్ ద్వారా నిజామాబాద్ కు రావచ్చును. మాదవనగర్ రైల్వే గేటు ద్వారా కూడా నిజామాబాద్ కు రావచ్చును. భారీ వాహనాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మీకు అనుకూలంగా నిజామాబాద్ కు దూరంలో పార్కింగ్ చేసుకోగలరు. 6 గంటల తర్వాత బైపాస్ ద్వారా వెళ్లవచ్చు.
Spread the love