Tuesday, June 9, 2026
E-PAPER
Homeజాతీయంమరీ ఇంత దారుణమా ?

మరీ ఇంత దారుణమా ?

- Advertisement -

యువతి పట్ల పోలీసుల 
అక్రమ చర్యలు !
తక్షణమే జోక్యం చేసుకోవాలి :
ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు 
బృందా కరత్‌ లేఖ


న్యూఢిల్లీ : కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) నిరసన నేపథ్యంలో ఆ ప్రదర్శనకు హాజరవుతుందనే భయంతో ఒక యువతిని బెదిరించి, అమెపై అక్రమగా నిఘా పెట్టి, అత్యంత అమానుషంగా వ్యవహరిస్తూ, గృహ నిర్బంధం చేసిన ఢిల్లీ పోలీసు సిబ్బంది అక్రమ చర్యలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం నేత, మాజీ ఎంపి బృందా కరత్‌ ‌ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ‌సతీష్‌ ‌గోల్చాకి సోమవారం ఒక లేఖ రాశారు. ఈ దారుణాలకు పాల్పడింది న్యూ రాజిందర్‌ ‌నగర్‌ ‌పోలీసు ఠాణా సిబ్బంది అని ఆమె తెలిపారు.

ఏం జరిగింది?
జూన్‌ 5‌వ తేదీ మధ్యాహ్నం 12.30గంటల సమయంలో అహనా సింగ్‌ ‌కైత్‌ ‌యువతి న్యూ రాజిందర్‌‌ నగర్‌‌లో ‘ఎనీ థింగ్‌ ఫిట్‌‌నెస్‌’ అనే పేరు గల జిమ్‌‌లో వుండగా, కొంతమంది పోలీసులు జిమ్‌‌లోకి వచ్చి ఆమె పేరు పెట్టి మరీ ఎవరని సిబ్బందిని ప్రశ్నించారు. తర్వాత కొంతమంది పోలీసుల బృందం, ఒక మహిళా పోలీసు ఆమెను పక్కనే గల కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ‌‘శ్రీరామ్‌ ఐఎఎస్‌’ వద్దకు తీసుకెళ్ళి ఆమెను చుట్టుముట్టి ఇంటరాగేట్‌ ‌చేయడం ఆరంభించారు. ఈ సందర్భంగా శివమ్‌, రీటా, కిరణ్‌ ‌వంటి కొంతమంది పోలీసు అధికారులను గుర్తించింది. ఆమె కుటుంబ నేపథ్యం, చదువు వంటి వివరాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా, రాజకీయంగా ఆమె అభిప్రాయాలు ఎంటో చెప్పాలని, తమకు పోలీసు ఇన్ఫార్మర్‌‌గా పనిచేయాలని, సిజెపి నిరసనలకు ఎవరెవరు వెళతున్నారో చెప్పాలని బెదిరించారు. అసలు తాను ఆ కార్యక్రమానికి వెళ్ళాలన్న ఉద్దేశ్యం కూడా లేదని ఆమె చెప్పినా వారు వినిపించుకోలేదు. ఒక దశలో ఆమె ఫోన్‌‌ను కూడా అప్పగించాలని కోరగా అందుకు అహనా తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. దానికి కోర్టు ఆదేశాలు వున్నాయా అని ప్రశ్నించింది. ఈ వేధింపులు ఆగుతాయన్న ఆశతో ఆ కాసేపటికే ఆమె తన ఫోన్లో వాట్సాప్‌ ‌సందేశాలు కూడా చూపించింది. ఆమె ఇంతలా సహకరించినా పోలీసుల తీరు మారలేదు. ఆమెపై తమ నిఘా వుంటుందని హెచ్చరించి వెళ్ళారు.ఆ రాత్రి 8గంటలకే తనను అప్పాయింట్‌ ‌చేశారంటూ ఒక యువ పోలీసు అధికారి వచ్చింది, ఆమె ఎక్కడకు వెళ్ళినా లొకేషన్‌ ‌షేర్‌ ‌చేయాలని, ప్రతి క్షణం ఆమె చర్యలపై నిఘా వుంటుందని చెప్పారు.

ఈ వేధింపులు భరించలేక అహనా సింగ్‌ ‌తనకు ఫోన్‌‌చేసి ఏడుస్తూ జరిగినదంతా వివరించిందని, ఆమె తీవ్రంగా భయపడిపోయిందని బృందా కరత్‌ ‌తెలిపారు. ఆమె కుటుంబం తనకు చాలా కాలం నుండి తెలుసునని చెప్పారు. అధికార దుర్వినియోగంపై చర్యులు తీసుకోవాలి..పోలీసు యంత్రాంగాన్ని ఇంత అసాధారణ రీతిలో దుర్వినియోగం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బృందా కరత్‌ ‌కోరారు. ఎలాంటి వారంటు లేకుండా ప్రధానంగా పురుష సిబ్బంది ఇలా ప్రశ్నించచడం, పైగా ఆమె ఫోన్‌‌ చెక్‌ చేయడం, ఆమెను గృహ నిర్బంధం చేసేలా వ్యవహరించడం ఇవన్నీ అక్రమ చర్యలేనని బృందా కరత్ పేర్కొన్నారు. ఒకవేళ ఆమె సిజెపి నిరసనలకు హాజరవాలని అనుకున్నా అది ఆమె ప్రజాస్వామ్య హక్కని, దాన్ని అడ్డగించే అధకారం ఎవరికీ లేదని ఆ లేఖలో ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో, ఎంతమందిని నిరసనల్లో పాల్గొనకుండా ఆపారో ఎవరికి తెలుసని ఆమె ప్రశ్నించారు. అహనా సింగ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర గర్హనీయమైనదని, ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కానిదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -