సెన్సెక్స్ 827 పాయింట్లు పెరుగుదల
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, రియాల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్‌కు మద్దతును అందించాయి. ఫలితంగా బబీఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.482 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 827.57 పాయింట్లు ఎగిసి 77,569.39 వద్ద ముగియగా, నిఫ్టీ 244.10 పాయింట్లు లాభపడి 24,206.90కు చేరింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాల్లో కొనసాగిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 77,642.23 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.31గా నమోదైంది. సెన్సెక్స్‌లో రిలయన్స్, టెక్ మహీంద్రా, బీఈఎల్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా లాభపడగా ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, ట్రెంట్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 76.17 డాలర్ల వద్ద, బంగారం ఔన్స్ ధర 4,108 డాలర్ల వద్ద నమోదైంది.
ఐటీ, పీఎస్‌యూ షేర్ల పరుగు
- Advertisement -
- Advertisement -


