విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మేము సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహిం చాం. అక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత బిజినెస్‌ను డైవర్సిఫై చేయాలనే ఉద్దేశంతో సినిమా పరిశ్రమను కూడా ఒక మంచి అవకాశంగా భావించాం. అభిషేక్ నామా వద్ద ఉన్న స్క్రిప్ట్ గురించి రవీందర్ రెడ్డి చెప్పారు. ఆయన విజన్ మాకు చాలా నచ్చింది. పెద్ద స్థాయిలో సినిమా చేయాలనే ఆలోచనతో ‘నాగబంధం` మొదలైంది. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో రూ.110 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాం.
హీరో కోసం వెతుకుతున్న సమయంలో విరాట్ కర్ణ ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించారు. ఈ సినిమా కోసం ఆయన అద్భుతంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి, ఎంతో అంకితభావంతో పనిచేశారు.
ఫైనల్ అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాం. విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మేము పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాం. మేము ఊహించిన దానికంటే గొప్పగా సినిమా వచ్చింది. ఈ సినిమా నిజంగా ఒక విజువల్ స్పెక్టాకిల్.
మా రథయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ నిజమైన ఆలయానికి వచ్చిన అనుభూతి కలుగుతోందని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువ ల్ కనిపిస్తుంది. ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించాలనే ఉద్దేశంతో ప్రతి సెట్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించాం.
ఆ నమ్మకంతోనే రూ.110 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టాం
- Advertisement -
- Advertisement -



