అశాలతో వెట్టి చాకిరి చేయించుకోవడం ఈ ప్రభుత్వనికే చెల్లింది..

– మాజీ ఎమ్మెల్సీ రూరల్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి..

నవతెలంగాణ- డిచ్ పల్లి
ఆశా కార్యకర్తలతో అన్ని సర్వేలు చేయించుకుంటేనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వారితోనే వ్యక్తి చాకిరీ చేయించుకోవడం ఈ ప్రభుత్వానికి చెల్లిందని ఈ రోజుల్లో
ఒక వాచ్మెన్ కూడా ఇంత తక్కువ వేతనంతో నెలపాటు కుటుంబాన్ని గడప లేరని మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూలర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్  భూపతిరెడ్డి అన్నారు. బుదవారం ఇందల్ వాయి తహసిల్దార్ కార్యాలయం వద్ద అశా కార్యకర్తలు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ పార్టీ ఎళ్ళవేళల అండగా ఉంటుందని బరోసా కల్పించి సిఐటియు పిలుపులో భాగంగా బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న అహర్నిశలు ఆరోగ్యాలకు సర్వేలకు అన్నింటిని నిక్కచ్చిగా ఆదేశాలను జారీ చేస్తూ పనులు చేయించుకుంటున్నారని వేతనలకు వచ్చేసరికి ఎర్చినోడి  మొఖం తుడ్చిన చందగా నేలకు ఎంతో కొంత అందజేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రెండు నెలల లోపే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని  వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆశ కార్యకర్తల సమ్మెలకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించిందని వివరించారు. దీంట్లో ఉన్న వారందరూ పేద వారేనని వీరికి కనీసం సమాన పనికి సమాన వేతనం అన్న అందజేసి న్యాయమైన డిమాండ్ను తీర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ఇంకోపక్క మధ్యాహ్న భోజన కార్మికులు కానీ అంగన్వాడీలకు కూడా డిమాండ్లు తీర్చకుండా రోడ్డుపై బైఠాయిస్తున్న పట్టించుకోవడం పట్టించుకోకపోవడం విద్యురంగ ఉందన్నారు. మహిళలు భిక్షాటన చేస్తూ టెంట్ లవద్ద చిన్న పిల్లలతో కూర్చున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కావడం లేదని ఇకనైనా వారి డిమాండ్ ను సానుకూల దృక్పథంతో ఆమోదించాలని భూపతిరెడ్డి కోరారు.అయన వేంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, సంతోష్ రెడ్డి,ఉప సర్పంచ్ బైరయ్య, నారాయణ్ నాయక్,కర్స మోహన్ తో పాటు అశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love