- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో తెలంగాణ సిద్దాంతకర్త,ప్రొపెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని తాడిచెర్ల పంచాయతీ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు గురువారం గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువత జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ.. ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి,ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,వార్డు సభ్యులు కామ బాబు,నిరంజన్ రావు,మేనం రాకెష్,జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



