– అమెరికా సుంకాల దెబ్బతో పరిశ్రమ విలవిల
ముంబయి : భారత రత్నాలు, ఆభరణాల రంగం ఊహించని సంక్షోభంలో చిక్కుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26లో ఈ రంగం ఎగుమతులు ఐదేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) వెల్లడించింది. ముఖ్యంగా మన దేశానికి ప్రధాన కొనుగోలుదారు అయిన అమెరికా విధించిన భారీ సుంకాలు ఈ పతనానికి ప్రధాన కారణమయ్యాయని తెలిపింది. 2025-26లో మొత్తం ఎగుమతులు 27.72 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇంతక్రితం ఏడాదిలోని 28.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 3.3 శాతం తగ్గుదల. కరోనా లాక్‌డౌన్‌ల సమయంలో వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయిన 2020-21 కాలం తర్వాత ఎగుమతులు ఇంత కనిష్ట స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. అమెరికాకు జరిగే ఎగుమతులు దాదాపు సగానికి పడిపోవడమే. అమెరికా విధించిన కొత్త సుంకాలు, దిగుమతి పన్నుల కారణంగా భారతీయ ఆభరణాలకు గిరాకీ తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు లక్షలాది మంది కళాకారులు, వ్యాపారులపై ఆధారపడి నడుస్తున్న ఈ పరిశ్రమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
అగాధంలోకి ఆభరణాల ఎగుమతులు
- Advertisement -
- Advertisement -



