Friday, April 17, 2026
E-PAPER
Homeబీజినెస్విప్రో భారీ బైబ్యాక్‌ ధమాకా

విప్రో భారీ బైబ్యాక్‌ ధమాకా

- Advertisement -

– రూ.15,000 కోట్లతో షేర్ల కొనుగోలు..
బెంగళూరు :
ప్రముఖ ఐటి దిగ్గజం విప్రో తన వాటాదారులకు తీపి కబురు అందించింది. కంపెనీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ (తిరిగి కొనుగోలు) చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఒక్కో షేరును రూ.250 చొప్పున కొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఉన్న షేరు ధర రూ.210తో పోలిస్తే, ఇది దాదాపు 19 శాతం అధికం కావడం విశేషం. మొత్తం 60 కోట్ల షేర్లను టెండర్‌ రూట్‌ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నివేదికలో విప్రో వెల్లడించింది. ఇది కంపెనీ మొత్తం పెయిడ్‌ అప్‌ షేర్‌ క్యాపిటల్‌లో 5.7 శాతానికి సమానం. ఇందుకు సంబంధించిన రికార్డు తేదీని త్వరలోనే ప్రకటించనుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో విప్రో నికర లాభాలు 2 శాతం తగ్గి రూ.3,502 కోట్లుగా చోటు చేసుకున్నాయి. కంపెనీ ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి రూ.24,236 కోట్లుగా నమోదయ్యింది. డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చినప్పుడు లాభంలో 12 శాతం పెరుగుదల కనిపించడం కొంత ఊరటనిచ్చే అంశం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -