Friday, April 17, 2026
E-PAPER
Homeక్రైమ్నిప్పంటించుకుని తల్లి ఆత్మహత్య

నిప్పంటించుకుని తల్లి ఆత్మహత్య

- Advertisement -

మంటలంటుకుని ఏడాది కూతురూ మృతి
నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలంలో ఘటన
నవతెలంగాణ-ధర్పల్లి

ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆ మంటలంటుకుని ఏడాది వయస్సు కూతురు సైతం మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ వినయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భీంగల్‌ మండలంలోని బడాభీమ్‌గల్‌కు చెందిన కీర్తన (25)కు ధర్పల్లి మండలం గోవింద్‌పల్లికి చెందిన ప్రదీప్‌తో ఆరేండ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లున్నారు. రెండో కుమార్తె సాన్వి(1)కి పుట్టుకతో మొర్రి వచ్చింది. పాప అలా పుట్టడానికి తానే కారణమని.. కీర్తన మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటి లోపలి నుంచి గడియ వేసుకుని పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో మంటలు సాన్వికి సైతం అంటుకున్నాయి. గమనించిన కుటుంబీకులు వెంటనే ఇంటి తలుపులు పగులగొట్టి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లిన భర్త నేరుగా ఆస్పత్రికి చేరుకుని భార్య, కూతురు మృతదేహాలను చూసి బోరున విలపించాడు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌ పంచనామా నిర్వహించారు. కీర్తన తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -